నీ ముఖము మనోహరము
Ni Mukhamu Manoharamu
నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిను వీడి క్షణమైనపాటల లిరిక్స్ పుస్తకం నీవే నాతోడువై నీవే నాజీవమై నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై అణువణువున నీకృప నిక్షిప్తమై నను ఎన్నడు వీడని అనుబంధమై ||యేసయ్య|| నీవే నా శైలమై నీవే నాశృంగమై నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు ||యేసయ్య|| నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నను మైమరచి నేనేమి చేసేదనో ||యేసయ్య||
ni mukhamu manoharamu ni svaramu madhuryamu ni padalu aparanji mayamu yesayya na prana priyuda managalana ninu vidi ksanamainapatala liriks pustakam nive natoduvai nive najivamai na hrdilona nilichina jnapikavai anuvanuvuna nikrpa niksiptamai nanu ennadu vidani anubandhamai ||yesayya|| nive na sailamai nive nasrngamai na vijayanike nivu bhujabalamai anuksanamuna satruvuku pratyaksamai nanu venudiyaniyaka vennu tattinavu ||yesayya|| nive veluguvai nive alayamai na nityatvamunaku adyantamai amaralokana sud'dhulato parichayamai nanu maimarachi nenemi chesedano ||yesayya||