హృదయమనెడు తలుపు నొద్ద
Hrdayamanedu Talupu Nodda
హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను || 2 || ||హృదయ|| పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు || 2 || ||హృదయ|| కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు || 2 || ||హృదయ|| ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను || 2 || ||హృదయ|| అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును || 2 || ||హృదయ|| జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు || 2 || ||హృదయ|| సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు || 2 || ||హృదయ|| చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను || 2 || ||హృదయ|| అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ || 2 || ||హృదయ|| బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి || 2 || ||హృదయ||
hrdayamanedu talupu nodda - yesu nathundu nilachi - sadayudaguchu dattuchundu - sakala vidhamulanu || 2 || ||hrdaya|| paruni boli niluchunnadu - parikinchi chuda natadu - parudu gadu raksakundu - prana snehitudu || 2 || ||hrdaya|| karuna silundatadu gana - gachi yunnadu yesu - karuna nerigi garavimpa - garamu n'yayambu || 2 || ||hrdaya|| enta sepu niluva betti - yedpintu ratani nata - dento dayache biluchuchunna - dippudu mim'mulanu || 2 || ||hrdaya|| atadu mitrudatadu mitrum - dakhila papulaku mira - latani pilupu vinti reni - yatadu priyudagunu || 2 || ||hrdaya|| jali cheta dana hastamula - japi yunnadu mim'mu - nalinganamu seya gori - yanisamu kanipettu || 2 || ||hrdaya|| satileni dayagala vadu - sarvesu sutudu tana - mata vinedu varala nella - sutiga raksinchu || 2 || ||hrdaya|| cherchukonudi mi hrdayamuna - sri yesunathu natadu - cherchukonuchu mi kichchunu - chira jivamu krpanu || 2 || ||hrdaya|| atadu tappaka kalugajeyu - nakhila bhagyamulu mira - latani hattukondu rappu - danandamu toda || 2 || ||hrdaya|| bratuku sasvatambu kadu - parikinchu chudu gana - bratiki yundu kalamunane - prabhuni goluvandi || 2 || ||hrdaya||