యేసయ్య కనికరపూర్ణుడా
Yesayya Kanikarapurnuda
యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి || 2 || సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే || యేసయ్య || నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి || 2 || ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము || యేసయ్య || నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన సీయెనులో వారు నిలిచెదరు || 2 || నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు || యేసయ్య || ఆరాధనకు యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు ..
yesayya kanikarapurnuda manohara premaku nilayuda nivena santosaganamu sarvasampadalaku adharamu na valana ediyu asimpakaye preminchitivi nanu raksinchutaku unnata bhagyamu vidichitivi || 2 || siluva manupai raktamu karchi raksinchitivi sasvata krpapondi jivintunu ila ni korake || yesayya || na koraku sarvamu dharalamuga dayacheyu vadavu dahayu tirchutaku bandanu chilchina upakarivi || 2 || alasina vari asanu trpti parachitivi ananta krpa pondi aradhintunu anuksanamu || yesayya || ni valana balamu nondina vare dhan'yulu ni sannidhiyaina siyenulo varu nilichedaru || 2 || niluvaramaina rajyamulo ninu chuchutaku nityamu krpa pondi sevinchedanu tudivaraku || yesayya || aradhanaku yogyudavu .. ellavelala pujyudavu ..