ఎంత పెద్ద పోరాటమో
Enta Pedda Poratamo
ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో || 2 || పోరాడతాను నిత్యము విజయమనేది తథ్యము || 2 || వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి విశ్వాసమనే డాలుని చేత పట్టి || 2 || ముందుకే దూసుకెళ్లెదన్ యెహోవాదే యుద్ధమనుచు || 2 || ||ఎంత|| ప్రార్థన యుద్ధములో కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కి పెట్టి || 2 || ముందుకే దూసుకెళ్లెదన్ యెహోవా నిస్సీ అనుచు || 2 || ||ఎంత|| యేసు కాడిని భుజమున పెట్టి వాగ్ధాన తలుపు విసుగక తట్టి || 2 || ముందుకే దూసుకెళ్లెదన్ సిలువలో సమాప్తమైనదనుచు || 2 || ||ఎంత||
enta pedda poratamo anta pedda vijayamo || 2 || poradatanu nityamu vijayamanedi tathyamu || 2 || vakyamane khadgamunu etti patti visvasamane daluni cheta patti || 2 || munduke dusukelledan yehovade yud'dhamanuchu || 2 || ||enta|| prarthana yud'dhamulo kanipetti satanu tantramulu tokki petti || 2 || munduke dusukelledan yehova nis'si anuchu || 2 || ||enta|| yesu kadini bhujamuna petti vagdhana talupu visugaka tatti || 2 || munduke dusukelledan siluvalo samaptamainadanuchu || 2 || ||enta||