క్రైస్తవుండా కదలిరావయ్యా
Kraistavunda Kadaliravayya
క్రైస్తవుండా కదలిరావయ్యా కలుషాత్ములకు ఈ సిలువశక్తిని చాటవేమయ్యా ఎండ వానలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు ||2|| కండలను ప్రేమింతువేమయ్యా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా వసుధలో ప్రజలెల్లరు యేసు వాక్యంబు విని క్షుద్బోదగొని వాదించు చుండగను మిషనులెల్ల మిషలచేత మిట్టపడుచు వాదములచే యేసు బోధను మరచినారన్నా నీవెంత కాలము వారి చెంత వుందువోరన్నా ||క్రైస్తవుండా|| సత్య వాక్యము సంతలో దులిపి భోదకుల దొరల భత్యములపై భాంతులు నిలపి – చిత్తమగు అనుకూల బోధలు చేసి ప్రజల మోసగించే – సూత్రదారుల చేరరాదయ్య – సుఖ భోగమిడిచి సత్య వాక్యము చాటరావయ్యా ||క్రైస్తవుండా|| శక్తిహీనుడవందు వేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా – భక్తిహీనత పారద్రోలి భష్ట మనసు బయలు పరచి – శక్తితో సువార్త చాటుదువు సువార్తచే జయమొంది ఆత్మల రక్షించెదవు ||క్రైస్తవుండా|| నీతికై భక్తాది పరులెల్లా – నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలా – కత్తిపోటులు రాళ్ళ దెబ్బలు కరుకుగల రంపములు కోతలు -బెత్తముల కొరడాల దెబ్బలు పైబడి చేర్చే దేహము వాలలాడెను రక్తము భూమిపై ||క్రైస్తవుండా|| దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సఖుడా ఖ్యాతిగా నీకిచ్చె గ్రంధంబు – ఖేతీయుల వినుము గ్రంధము తేనెవలె మధురముగా నుండును – జ్ఞానము నీకబ్బునో హితుడా జ్ఞానంబు నొంది స్వామిని సేవించుమో సఖుడా ||క్రైస్తవుండా|| ఆది సంఘము నార్పుటకునేంచి – ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి – ఆది క్రైస్తవ భక్తుల స్థంభముల గట్టి తారు పూసి అగ్నిని ముట్టించి కాల్వంగ – ఆ సంఘమొచ్చె అధిపతి అప్పుడే నశియించే ||క్రైస్తవుండా||
kraistavunda kadaliravayya kalusatmulaku i siluvasaktini chatavemayya enda vanalaniyu jadisi entakalamu mulanunduvu ||2|| kandalanu premintuvemayya i matti kandalu enta penchina mattikenanna vasudhalo prajalellaru yesu vakyambu vini ksudbodagoni vadinchu chundaganu misanulella misalacheta mittapaduchu vadamulache yesu bodhanu marachinaranna niventa kalamu vari chenta vunduvoranna ||kraistavunda|| satya vakyamu santalo dulipi bhodakula dorala bhatyamulapai bhantulu nilapi - chittamagu anukula bodhalu chesi prajala mosaginche - sutradarula cheraradayya - sukha bhogamidichi satya vakyamu chataravayya ||kraistavunda|| saktihinudavandu vemayya saujan'yamagu sud'dhatma saktini pondukonumayya - bhaktihinata paradroli bhasta manasu bayalu parachi - saktito suvarta chatuduvu suvartache jayamondi atmala raksinchedavu ||kraistavunda|| nitikai bhaktadi parulella - nija visvasamu nilupukona poradire chala - kattipotulu ralla debbalu karukugala rampamulu kotalu -bettamula koradala debbalu paibadi cherche dehamu valaladenu raktamu bhumipai ||kraistavunda|| dutalaku lenatti paricharya o priya sakhuda khyatiga nikichche grandhambu - khetiyula vinumu grandhamu tenevale madhuramuga nundunu - jnanamu nikabbuno hituda jnanambu nondi svamini sevinchumo sakhuda ||kraistavunda|| adi sanghamu narputakunenchi - a dusta niro adhipati chelaregi garvinchi - adi kraistava bhaktula sthambhamula gatti taru pusi agnini muttinchi kalvanga - a sanghamochche adhipati appude nasiyinche ||kraistavunda||