నా గీతారాధనలో యేసయ్యా
Na Gitaradhanalo Yesayya
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – || 2 || ||నా గీతా|| నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే || 2 || నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టెనే || 2 || ||నా గీతా|| చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే || 2 || నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే || 2 || ||నా గీతా|| ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే || 2 || ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై || 2 || ||నా గీతా||
na gitaradhanalo yesayya ni krpa adharame na avedanalalo janinchene ni krpadarana - || 2 || ||na gita|| ni krpa nalo vyardhamu kaledu - ni krpa vakyame chedaina veru edaina nalo - molavanivvaledule || 2 || ni krpa nalo atyunnatamai nito nannu antu kattene || 2 || ||na gita|| cheniloni pairu chetiki rakunna - phalamulanni ralipoyina siri sampadalanni duramai poyina - nenu chalinchanule || 2 || nischalamaina rajyamu korake ellavelala ninne aradhintune || 2 || ||na gita|| atmabhisekam ni prema nalo - ninduga kum'marinchene atma phalamulenno menduga nalo - phalimpajesene || 2 || atmato satyamuto aradhinchuchu ne vechiyundune ni rakadakai || 2 || ||na gita||