యెహోవా నా బలమా
Yehova Na Balama
యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం || 2 || ||యెహోవా|| నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ || 2 || వరదవలె భక్తిహీనులు పొర్లిన || 2 || విడువక నను ఎడబాయని దేవా || 2 || ||యెహోవా|| మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై || 2 || తన ఆలయములో నా మొఱ్ఱ వినెను || 2 || ఆదరెను ధరణి భయకంపముచే || 2 || ||యెహోవా|| నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును || 2 || జలరాసులనుండి బలమైన చేతితో || 2 || వెలుపల చేర్చిన బలమైన దేవుడు || 2 || ||యెహోవా|| పౌరుషముగల ప్రభు కొపింపగా పర్వతముల పునాదులు వణకెను || 2 || తన నోటనుండి వచ్చిన అగ్ని || 2 || దహించివేసెను వైరులనెల్లన్ || 2 || ||యెహోవా|| మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును || 2 || ఉరుముల మెరుపుల మెండుగ జేసి || 2 || అపజయమిచ్చును అపవాదికిని || 2 || ||యెహోవా|| దయగలవారిపై దయ చూపించును కఠినులయెడల వికటము జూపును || 2 || గర్విష్టుల యొక్క గర్వమునణుచును || 2 || సర్వమునెరిగిన సర్వాధికారి || 2 || ||యెహోవా|| నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి || 2 || రక్షణ కేడెము నాకందించి || 2 || అక్షయముగ తన పక్షము జేర్చిన || 2 || ||యెహోవా|| యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే || 2 || అన్యజనులలో ధన్యత చూపుచు || 2 || హల్లెలూయ స్తుతిగానము చేసెద || 2 || ||యెహోవా||
yehova na balama yadarthamainadi ni margam paripurnamainadi ni margam || 2 || ||yehova|| na satruvulu nanu chuttinanu narakapu pasamularikattinanu || 2 || varadavale bhaktihinulu porlina || 2 || viduvaka nanu edabayani deva || 2 || ||yehova|| maranaputurulalo maruvaka moralida unnatadurgamai raksanasrngamai || 2 || tana alayamulo na morra vinenu || 2 || adarenu dharani bhayakampamuche || 2 || ||yehova|| na dipamunu veliginchuvadu na chikatini veluguga cheyunu || 2 || jalarasulanundi balamaina chetito || 2 || velupala cherchina balamaina devudu || 2 || ||yehova|| paurusamugala prabhu kopimpaga parvatamula punadulu vanakenu || 2 || tana notanundi vachchina agni || 2 || dahinchivesenu vairulanellan || 2 || ||yehova|| meghamulapai ayana vachchunu meghamulanu tana matuga jeyunu || 2 || urumula merupula menduga jesi || 2 || apajayamichchunu apavadikini || 2 || ||yehova|| dayagalavaripai daya chupinchunu kathinulayedala vikatamu jupunu || 2 || garvistula yokka garvamunanuchunu || 2 || sarvamunerigina sarvadhikari || 2 || ||yehova|| na kallanu ledi kalluga jeyunu ettaina sthalamulo saktito nilipi || 2 || raksana kedemu nakandinchi || 2 || aksayamuga tana paksamu jerchina || 2 || ||yehova|| yehova jivamugala deva bahuga stutulaku ar'huda nive || 2 || an'yajanulalo dhan'yata chupuchu || 2 || halleluya stutiganamu cheseda || 2 || ||yehova||