నా ప్రాణమా నాలో నీవు

Na Pranama Nalo Nivu

Bro. Yesanna Garu 16 Nov 2025

నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు || 2 || ||నా ప్రాణమా|| ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ || 2 || నీ కొరకే బలియైన యేసు సిలువను గూర్చి తలపోయుమా || 2 || అల్పకాల శ్రమల పిదప మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా || 2 || ||నా ప్రాణమా|| ఆప్తులంతా నిను వీడిననూ శత్రువులే నీపై లేచిననూ || 2 || తల్లి అయినా మరచినా మరచున్ నేను నిన్ను మరువాననినా || 2 || యేసుని ప్రేమన్ తలపోయుమా ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా || 2 || ||నా ప్రాణమా|| ఐశ్వర్యమే లేకున్ననూ సౌఖ్య జీవితమే కరువైననూ || 2 || ప్రభు సేవలో ప్రాణములనే అర్పించవలసి వచ్చిననూ || 2 || క్రీస్తునికే అంకితమై ఆనందించు ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా || 2 || ||నా ప్రాణమా||


na pranama nalo nivu enduku krngiyunnavu yehovayande inkanu niriksana unchumu nivu || 2 || ||na pranama|| iti badhal kathina sramalu avamanamule kaligina vela || 2 || ni korake baliyaina yesu siluvanu gurchi talapoyuma || 2 || alpakala sramala pidapa mahimato ninu nimpunu prabhu na pranama || 2 || ||na pranama|| aptulanta ninu vidinanu satruvule nipai lechinanu || 2 || talli ayina marachina marachun nenu ninnu maruvananina || 2 || yesuni preman talapoyuma asrayinchu prabhuni na pranama || 2 || ||na pranama|| aisvaryame lekunnanu saukhya jivitame karuvainanu || 2 || prabhu sevalo pranamulane arpinchavalasi vachchinanu || 2 || kristunike ankitamai anandinchu prabhu rakakai kanipettuma na pranama || 2 || ||na pranama||