హోసన్ననుచూ స్తుతి పాడుచూ
Hosannanucu Stuti Paducu
హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం || 2 || హోసన్నా… హోసన్నా… (4) ||హోసన్ననుచూ|| ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన కడలిలో పరదేశులం || 2 || క్షణభంగురం ఈ క్షయ జీవితం అక్షయ నగరం మనకు శాశ్వతం || 2 || ||హోసన్నా|| మన్నయిన ఈ దేహం మహిమరూపమై ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము || 2 || నాధుడేసుకు నవ వధువులము నీతి పాలనలోన యువరాణులము || 2 || ||హోసన్నా|| ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును చింతలన్ని తీర్చి చెంత నిలుచును || 2 || ఆకలి లేదు దప్పిక లేదు ఆహా మన యేసుతో నిత్యమానందం || 2 || ||హోసన్నా||
hosannanuchu stuti paduchu siyonuku cheredam || 2 || hosanna... hosanna... (4) ||hosannanuchu|| i lokayatralo batasarulam i jivana kadalilo paradesulam || 2 || ksanabhanguram i ksaya jivitam aksaya nagaram manaku sasvatam || 2 || ||hosanna|| mannayina i deham mahimarupamai dhavalavarna vastramulu dhariyinchedamu || 2 || nadhudesuku nava vadhuvulamu niti palanalona yuvaranulamu || 2 || ||hosanna|| prati bhaspa binduvunu tudichiveyunu chintalanni tirchi chenta niluchunu || 2 || akali ledu dappika ledu aha mana yesuto nityamanandam || 2 || ||hosanna||