నీవు లేని రోజు
Nivu Leni Roju
నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా || 2 || నీవే లేకపోతే నేనసలే లేనయా || 2 || ||నీవు లేని|| బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు || 2 || నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు || 2 || ||నీవే|| ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే || 2 || నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు || 2 || ||నీవే||
nivu leni roju asalu roje kadaya nivu leni bratuku asalu bratuke kadaya || 2 || nive lekapote nenasale lenaya || 2 || ||nivu leni|| badha kalugu velalo nem'madi nakichchavu na kanniru tudachi na cheyi pattavu || 2 || nannu viduvanannavu - na devudainavu || 2 || ||nive|| i nati na sthiti nivu naku ichchinade nenu kaligiyunnavanni nidu krpa bhagyame || 2 || nivu na sottannavu - krpaksemamichchavu || 2 || ||nive||