మధురమైనది నా యేసు ప్రేమ

Madhuramainadi Na Yesu Prema

16 Nov 2025

మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ || 2 || మరువలేనిది నా యేసుని ప్రేమ || 2 || మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా… ప్రేమా… ప్రేమా… నా యేసు ప్రేమా || 2 || ||మధురమైనది|| ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని || 2 || చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి || 2 || నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం ||ప్రేమా|| పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా ఎగసి పడే అలలతో కడలే గర్జించినా || 2 || మరణపు ఛాయలే దరి చేరనీయక || 2 || కౌగిట దాచిన నీ ప్రేమ మధురం ||ప్రేమా|| నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి || 2 || మరణపు ముల్లును విరచిన దేవా || 2 || జీవము నొసగిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||


madhuramainadi na yesu prema marapuranidi na tandri prema || 2 || maruvalenidi na yesuni prema || 2 || madhurati madhuram na priyuni prema prema... prema... prema... na yesu prema || 2 || ||madhuramainadi|| ihaloka asalato andhuda nenaitini ni sannidhi vidachi niku duramaitini || 2 || challani svaramuto nannu nivu pilachi || 2 || nilo nanu nilipina ni prema madhuram ||prema|| parvatamulu tolagina mettalu gati tappina egasi pade alalato kadale garjinchina || 2 || maranapu chhayale dari cheraniyaka || 2 || kaugita dachina ni prema madhuram ||prema|| ni siluva premato nannu preminchi margamunu chupi manninchitivi || 2 || maranapu mullunu virachina deva || 2 || jivamu nosagina ni prema madhuram ||prema||