అదిగో నా నావ బయలు దేరుచున్నది
Adigo Na Nava Bayalu Derucunnadi
అదిగో నా నావ బయలు దేరుచున్నది అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు || 2 || వరదలెన్ని వచ్చినా వణకను అలలెన్ని వచ్చినా అదరను || 2 || ఆగిపోయే అడ్డులొచ్చినా సాగిపోయే సహాయం మనకు ఆయనే || 2 || ||అదిగో|| నడిరాత్రి జాములో నడచినా నది సముద్ర మధ్యలో నిలచినా || 2 || నడిపించును నా యేసు నన్నూ అద్దరికి చేర్చును || 2 || ||అదిగో|| లోతైన దారిలో పోవుచున్నది సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి || 2 || సూర్యుడైన ఆగిపోవును చుక్కాని మాత్రం సాగిపోవును || 2 || ||అదిగో||
adigo na nava bayalu deruchunnadi andulo yesu unnadu na navalo kristu unnadu || 2 || varadalenni vachchina vanakanu alalenni vachchina adaranu || 2 || agipoye addulochchina sagipoye sahayam manaku ayane || 2 || ||adigo|| nadiratri jamulo nadachina nadi samudra madhyalo nilachina || 2 || nadipinchunu na yesu nannu addariki cherchunu || 2 || ||adigo|| lotaina darilo povuchunnadi sudigundalenno tiruguchunnavi || 2 || suryudaina agipovunu chukkani matram sagipovunu || 2 || ||adigo||