ఇదిగో దేవా నా జీవితం

Idigo Deva Na Jivitam

Y Babji 28 Oct 2025

ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం || 2 || శరణం నీ చరణం (4) ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి || 2 || అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ||ఇదిగో|| నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము || 2 || ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో|| విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు || 2 || క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా నశియించే ఆత్మలన్ నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||


idigo deva na jivitam apadamastakam nikankitam || 2 || saranam ni charanam (4) ||idigo|| palumarlu vaidolaginanu paraloka darsanamunundi viluvaina ni divya pilupuku ne taginatlu jivinchanaiti || 2 || ayina ni premato nannu daricherchinavu anduke gaikonumu deva i na sesa jivitam ||idigo|| ni padamula chenta cheri ni chittambu neneruga nerpu ni hrdaya bharambu nosagi prarthinchi panicheyanim'mu || 2 || agipoka sagipovu priyasutuniga panicheyanim'mu prati chota ni saksiga prabhuva nannundanim'mu ||idigo|| vistara panta polamu nundi kastinchi pani cheya nerpu kannitito vittu manasu kalakalam mari naku nosagu || 2 || ksema ksama kalamaina ninnu ghanaparachu batukunim'mayya nasiyinche atmalan ni dari cherchu krpanim'mayya ||idigo||