ఈ తరం యువతరం

I Taram Yuvataram

Satish Kumar 28 Oct 2025

ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు వార్త చాటుదాం రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం|| సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా దేవుని సేవ వ్యాపారమాయే ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ|| నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా యేసయ్య రాకడ సామీపమాయే ఆ వార్త చాటను వేగిర రావే నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ||


i taram yuvataram prabhu yesuke ankitam na balam yavvanam prabhu yesuke sontamu ra sodari rara sodara prabhu yesu varta chatudam ra sodari rara sodara prabhu yesu rajyamu sthapiddam ||i taram|| suvarta seva nanatiki challaripoyega atmala sampada mari enduko adugantipoyega devuni seva vyaparamaye atmala raksana nirlaksyamaye nivu kakapote inkevvaru nedu kakapote inkennadu ||ra sodari|| nasinchipoye atmalu enno alladuchundenuga yesayya prema chatinche sain'yam bahu takkuvayega yesayya rakada samipamaye a varta chatanu vegira rave nivu kakapote inkevvaru nedu kakapote inkennadu ||ra sodari||