ఎవరూ సమీపించలేని

Evaru Samipincaleni

Hosanna Ministries 28 Oct 2025

ఎవరూ సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా || 2 || నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే || 2 || ఏమౌదునో నేనేమౌదునో || 2 || ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి || 2 || నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ || 2 || ||ఏమౌదునో|| పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి || 2 || పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ || 2 || ||ఏమౌదునో|| జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా || 2 || ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ || 2 || ||ఏమౌదునో||


evaru samipinchaleni tejas'suto nivasinchu na yesayya || 2 || ni mahimanu dharinchina parisud'dhulu na kantabadagane || 2 || emauduno nenemauduno || 2 || ihaloka bandhalu marachi ni yedute nenu nilichi || 2 || nivichchu bahumatulu ne svikarinchi nityanandamuto paravasinchu vela || 2 || ||emauduno|| paraloka mahimanu talachi ni pada padmamulapai origi || 2 || paraloka sain'ya samuhalato kalasi nityaradhana ne cheyu prasanta vela || 2 || ||emauduno|| jayinchina varito kalisi ni sinhasanamu ne cheraga || 2 || evariki teliyani o krotta peruto nitya mahimalo nanu piliche a subha vela || 2 || ||emauduno||