ఇది శుభోదయం
Idi Subhodayam
ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం – || 2 || రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ||ఇది|| గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే ఈ భువిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది||
idi subhodayam - kristu janmadinam idi loka kalyanam meri punyadinam - || 2 || rajulanele raraju velase pasuvula pakalo papula palita raksakudu navvenu talli kaugililo bhayamu ledu manakilalo jayamu jayamu jayamaho ||idi|| gollalu jnanulu anadu pranamilliri bhaya bhaktito pillalu peddalu inadu pujinchiri prema gitito jayanadame i bhuvilo pratidhvaninchenu a divilo ||idi||