దినమెల్ల నే పాడినా

Dinamella Ne Padina

16 Dec 2025

దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ||దినమెల్ల|| గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా || 2 || నిను విడువనూ ఎడబాయననినా || 2 || నా యేసయ్య ||దినమెల్ల|| నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ || 2 || ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము || 2 || నేను పొందాలని ||దినమెల్ల||


dinamella ne padina kirtinchina ni rnamu ne tirchagalana koniyadi padi ni saksigane ilalo jivinchana ||dinamella|| gayapadina samayana manchi samarayunila na gayalu kadigina deva akalaina velalo aharamichchi nannu posinchinavu deva || 2 || ninu viduvanu edabayananina || 2 || na yesayya ||dinamella|| na balahinatayandu na siluvanu mostu ninnu poli nenu nadichedan venukunnavi marachi mundunna vatikai sahanamuto parugettedan || 2 || unnata pilupunaku kalugu bahumanamu || 2 || nenu pondalani ||dinamella||