ద్రాక్షావల్లివి నీవైతే

Draksavallivi Nivaite

28 Oct 2025

ద్రాక్షావల్లివి నీవైతే తీగెగ నేను ఎదిగితిని || 2 || తండ్రి తోటలో నే నాటబడితి ఎంత ధన్యత ఈ మహిలో – || 2 || ||ద్రాక్షా|| చల్ల గాలులు వీచగా కాంతి కిరణాలు ప్రసరించగా || 2 || నీతి సూర్యుని నిజ కాంతిలోన తేజరిల్లెడి బ్రతుకు తోడ రక్షణ తోటలో విరివిగ పెరిగి నీటి యోరన నిలిచితిని – || 2 || ||ద్రాక్షా|| కొమ్మ కొమ్మను చూడగా తీగలెన్నో అగుపించెనే || 2 || ఆకు మాటున తీగె గావున మొలవనున్నవి ఫలములెన్నో నిలిచె అందులో ఫలితము కొరకై కలిగె స్నేహము యేసునితో – || 2 || ||ద్రాక్షా||


draksavallivi nivaite tigega nenu edigitini || 2 || tandri totalo ne natabaditi enta dhan'yata i mahilo - || 2 || ||draksa|| challa galulu vichaga kanti kiranalu prasarinchaga || 2 || niti suryuni nija kantilona tejarilledi bratuku toda raksana totalo viriviga perigi niti yorana nilichitini - || 2 || ||draksa|| kom'ma kom'manu chudaga tigalenno agupinchene || 2 || aku matuna tige gavuna molavanunnavi phalamulenno niliche andulo phalitamu korakai kalige snehamu yesunito - || 2 || ||draksa||