నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
Nenemaina Prabhuva Ninne Stutistanu
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను || 2 || నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా || 2 || నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా || 2 || ||నేనేమైనా|| లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే || 2 || ఇచ్చిన నీవే బలి కోరగా || 2 || తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా|| సర్వము పోయి శరీరము కుళ్ళిన నా అనువారే వెలివేసినా || 2 || ఆప్తులంతా శత్రువులైనా || 2 || అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా|| నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా అది నాకెంతో మేలే || 2 || ఇదిగో నేను ఉన్నానయ్యా || 2 || దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||
nenemaina prabhuva ninne stutistanu nakemunna prabhuva nike arpistanu || 2 || nenemaiyunnano ni daya valanenayya || 2 || nakunnavanniyu nivichchinavenayya || 2 || ||nenemaina|| leka leka vrd'dhapyamandu ekaika kumaruni ichchindi nive || 2 || ichchina nive bali koraga || 2 || techchi niku arpinchina abrahamula ||nenemaina|| sarvamu poyi sariramu kullina na anuvare velivesina || 2 || aptulanta satruvulaina || 2 || antamu varaku sahiyinchina a yobula ||nenemaina|| na mattukaite bratukuta kriste chavaina adi nakento mele || 2 || idigo nenu unnanayya || 2 || dayato nannu gaikonumayya na yesayya ||nenemaina||