తల్లిలా లాలించును తండ్రిలా

Tallila Lalincunu Tandrila

28 Oct 2025

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును || 2 || ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా ||తల్లిలా|| తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను || 2 || నీ పాదము తొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా|| పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధనా తొలగదు || 2 || దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||


tallila lalinchunu tandrila preminchunu || 2 || mudimi vachchuvaraku ettukoni muddadunu chanka pettukoni kapadunu yesayya ||tallila|| talli ayina marachunemo nenu ninnu maruvanu chudumu na arachetulalo ninnu chekkiyunnanu || 2 || ni padamu totrillaniyanu nenu ninnu kapaduvadu kunukadu nidurapodu ani cheppi vagdanam chesina yesayya ||tallila|| parvatalu tolagavachchu tattarillu mettalanni vidipodu na krpa niku na nibandhana tolagadu || 2 || digulupadaku bhayapadaku ninnu vimochincheda nidu bharamanta mosi nadu santi nosageda ani cheppi vagdanam chesina yesayya ||tallila||