నీ రక్త ధారలే

Ni Rakta Dharale

28 Oct 2025

నీ రక్త ధారలే – మా జీవనాధారాము నీ సిల్వ మార్గమే – మా మోక్ష భాగ్యము ఓ సిల్వ రాజ – క్రీస్తు రాజ నీతి రాజ – యేసు రాజ || 2 || మాలోన పలికించు జీవన రాగము – నీ ఆర్తనాదములే మాలోన వెలిగించు జీవన జ్యోతులు – నీ సిల్వ రూపమే ||ఓ సిల్వ|| మమ్మును నడిపించు పరలోకమునకు – నీ సత్య వాక్యమే పాపపు చీకట్లు పారద్రోలెను – నీ నీతి ప్రభావమే ||ఓ సిల్వ|| నీ సిలువ మరణము మనుజాళికంత – కలిగించె రక్షణ నీ మరణ విజయము జగమందు వెలుగొందు – క్రైస్తవ విజయమై ||ఓ సిల్వ||


ni rakta dharale - ma jivanadharamu ni silva margame - ma moksa bhagyamu o silva raja - kristu raja niti raja - yesu raja || 2 || malona palikinchu jivana ragamu - ni artanadamule malona veliginchu jivana jyotulu - ni silva rupame ||o silva|| mam'munu nadipinchu paralokamunaku - ni satya vakyame papapu chikatlu paradrolenu - ni niti prabhavame ||o silva|| ni siluva maranamu manujalikanta - kaliginche raksana ni marana vijayamu jagamandu velugondu - kraistava vijayamai ||o silva||