నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా
Nannentagano Premincina Prabhuva
నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా నా దీన బ్రతుకునే దీవించిన దేవా || 2 || నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును || 2 || నా యవ్వనమంతా… నా జీవితమంతా || 2 || ||నన్నెంతగానో|| ధరలోని మన్నుతో సమమైన నన్ను ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు || 2 || అన్నీ నీవే నాకై సమకూర్చినావు ఉన్నాను నీ తోడు భయపడకన్నావు || 2 || వాక్యపు మన్నాతో పోషించిన నన్నే ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే ||నిన్నే|| దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు || 2 || మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు || 2 || పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో మరణపు విల్లును విరచిన దేవా నీలో ||నీలో||
nannentagano preminchina prabhuva na dina bratukune divinchina deva || 2 || ninne aradhintunu - nilo anandintunu || 2 || na yavvanamanta... na jivitamanta || 2 || ||nannentagano|| dharaloni mannuto samamaina nannu ennukoni unnata sthitiki cherchinavu || 2 || anni nive nakai samakurchinavu unnanu ni todu bhayapadakannavu || 2 || vakyapu mannato posinchina nanne ennadu viduvani edabayani ninne ||ninne|| dinamella na korake kanipettinavu ellavelala na toduga nilichavu || 2 || mellani ni svaramuto matladinavu challani karamulato na kanniru tudichavu || 2 || papapu mullunu tolaginchutakai nalo maranapu villunu virachina deva nilo ||nilo||