నన్నెంతగా ప్రేమించితివో
Nannentaga Premincitivo
నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా – నే చెప్పగలనా దాయనా – నే దాయగలనా || 2 || అయ్యా… నా యేసయ్యా నాదం – తాళం – రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము || 2 || ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో || 2 || ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో || 2 || ||గలనా|| ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో || 2 || ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో || 2 || ||గలనా||
nannentaga preminchitivo ninnantaga dusinchitino nannentaga niverigitivo ninnantaga ne marachitino galana - ne cheppagalana dayana - ne dayagalana || 2 || ayya... na yesayya nadam - talam - ragam edalo nide i prema svaramu || 2 || e ritiga na udayamunu ni atmato divinchitivo e ritiga na bharamunu ni karunato mositivo || 2 || e ritiga na palukulo ni namamunu nilipitivo e ritiga na kannitini ni premato tudichitivo || 2 || ||galana|| e ritiga na ratanu ni chetito rasitivo e ritiga na batanu ni matato malichitivo || 2 || e ritiga na gamyamunu ni siluvato marchitivo e ritiga na durgamunu ni krpato kattitivo || 2 || ||galana||