నీవు లేనిదే నేను లేను ప్రభువా
Nivu Lenide Nenu Lenu Prabhuva
నీవు లేనిదే నేను లేను ప్రభువా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా || 2 || నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం || 2 || మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా || 2 || నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము || 2 || ||నీవు|| గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళ తీరాన్ని దాటలేని నావ నేనైన వేళ || 2 || నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే || 2 || ఆ సిలువే నాకు శరణం నా పాప పరిహారం || 2 || ||నీవు|| అపజయమే నాదు బ్రతుకును విషాదముగా మార్చిన వేళ జీవించుటకాశ లేక మరణాన్ని కోరిన వేళ || 2 || నా ఆశ నీవైతి – ఆ ఆశ సిలువాయే || 2 || ఆ సిలువే నాకు నిరతం నా జీవిత చిరుదీపం || 2 || ||నీవు||
nivu lenide nenu lenu prabhuva ni krpa lenide ne bratukalenayya bratukalenayya nivu leka ksanamaina || 2 || nivu lekunte na bratuke sun'yam || 2 || maruvakayya nannu e ksanamu deva || 2 || ni premato nannu lalinchu prati ksanamu || 2 || ||nivu|| gamyamunu erugaka nenu vetalu palaina vela tiranni dataleni nava nenaina vela || 2 || na gamyam nivaiti - a gamyam siluvaye || 2 || a siluve naku saranam na papa pariharam || 2 || ||nivu|| apajayame nadu bratukunu visadamuga marchina vela jivinchutakasa leka marananni korina vela || 2 || na asa nivaiti - a asa siluvaye || 2 || a siluve naku niratam na jivita chirudipam || 2 || ||nivu||