నీ దయలో నేనున్న ఇంత కాలం
Ni Dayalo Nenunna Inta Kalam
నీ దయలో నేనున్న ఇంత కాలం నీ కృపలో దాచినావు గత కాలం || 2 || నీ దయ లేనిదే నేనేమౌదునో || 2 || తెలియదయ్యా… ||నీ దయలో|| తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా || 2 || నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో|| నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండ దాచావు || 2 || నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు నీ పాదాల చెంతనే నే పరవశించాలని నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||
ni dayalo nenunna inta kalam ni krpalo dachinavu gata kalam || 2 || ni daya lenide nenemauduno || 2 || teliyadayya... ||ni dayalo|| tallidandrulu chupistaru enaleni premanu ilalo cheyalani asistaru andananta goppavariga || 2 || ni daya unte varu - kagalaru adhipatuluga ni daya lekapote ilalo - bratukuta jaruguna ni siluva nidalone nanu dachiyunchavani na sesa jivitanni nitone gadapalani ||ni dayalo|| nela rale na prananni lepi nannu nilipavu apavadi koralaku antakunda dachavu || 2 || ni rekkala nidalo nakasraya durgamu e kidu na dariki rakunda ni krpanu todunchinavu ni padala chentane ne paravasinchalani na ayuvunnanta varaku ni prema pondalani ||ni dayalo||