నీ ధనము నీ ఘనము
Ni Dhanamu Ni Ghanamu
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా ||నీ ధనము|| ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా || 2 || పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీ ధనము|| పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా || 2 || వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా ||నీ ధనము|| వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా || 2 || వెలిగించ ధర పైని ప్రభు నామము కలిమి కొలది ప్రభున కర్పింపవా ||నీ ధనము|| కలిగించె సకలంబు సమృద్దిగా తొలగించె పలుభాధ భరితంబులు || 2 || బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||నీ ధనము||
ni dhanamu ni ghanamu prabhu yesude ni dasama bhagamuniya venudituva - venudituva ||ni dhanamu|| dharalona dhana dhan'yamula niyaga karuninchi kapadi raksimpaga || 2 || paraloka nadhundu nikiyaga mari yesu korakiya venudituva ||ni dhanamu|| padipantalu prabhuvu nikiyaga kudu guddalu niku dayacheyaga || 2 || vedanga prabhu yesu namambunu gaduvela prabhukiya no kraistava ||ni dhanamu|| velugu nidalu gali varsambulu kaliginche prabhu niku uchitambuga || 2 || veligincha dhara paini prabhu namamu kalimi koladi prabhuna karpimpava ||ni dhanamu|| kaliginche sakalambu samrddiga tolaginche palubhadha bharitambulu || 2 || baliyaye ni papamula kesuve cheluvanga prabhukiya chintintuva ||ni dhanamu||