ప్రార్థన వినెడి పావనుడా

Prarthana Vinedi Pavanuda

29 Oct 2025

ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన|| శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రనుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగా మోడ్చి శిరమునువంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యి దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైన నిను జంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||


prarthana vinedi pavanuda prarthana maku nerpumaya ||prarthana|| srestamaina bhavamu gurchi sisya brndamuku nerpitivi paramuda ninnu pranutinchedamu paraloka prarthana nerpumaya ||prarthana|| parama devudavani telisi karamu letti jantaga modchi siramunuvanchi sariganu vedina sunkari prarthana nerpumaya ||prarthana|| dinadinambu chesina seva daiva chittamuku saripova dinudavayyi ditamuga kondanu chesina prarthana nerpumaya ||prarthana|| satrumuka ninu chuttukoni siluvapaina ninu jampaganu santamuto ni satrula brovaga salipina prarthana nerpumaya ||prarthana||