ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
Prarthana Sakti Naku Kavalayya
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా || 2 || యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావలయ్యా || 2 || || ప్రార్థన || ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా || 2 || ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా || 2 || నిరంతరం ప్రార్థింప కృపనీయుమా || 2 || || ప్రార్థన || సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావలయ్యా || 2 || నీతో నడిచే వరమీయుమా || 2 || నీ సిలువను మోసే కృపనీయుమా || 2 || || ప్రార్థన || పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా || 2 || చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె || 2 || ఈ చిన్న వాడిని అభిషేకించు || 2 || || ప్రార్థన ||
prarthana sakti naku kavalayya ni paraloka abhisekam kavalayya || 2 || yesayya kavalayya ni atma abhisekam kavalayya || 2 || || prarthana || eliya prarthimpaga pondina sakti nenu prarthimpaga dayacheyuma || 2 || prarthinchi ninu cheru bhagyamiyuma || 2 || nirantaram prarthimpa krpaniyuma || 2 || || prarthana || sinhala guhaloni daniyelu sakti i lokanlo naku kavalayya || 2 || nito nadiche varamiyuma || 2 || ni siluvanu mose krpaniyuma || 2 || || prarthana || peturu prarthimpaga ni atmanu dimpitivi ne padu chotella digira deva || 2 || chinna vayasulo abhisekinchina yirmiya vale || 2 || i chinna vadini abhisekinchu || 2 || || prarthana ||