నీటి వాగుల కొరకు

Niti Vagula Koraku

18 Nov 2025

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నాప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమాప్రభుని స్తుతియించుమా నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా పనికిరాని నన్ను నీవు పైకిలేపితివి క్రీస్తనే బండపైన నన్నునిలిపితివి || 2 || నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు || నా ప్రాణమా || అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి || 2 || కంటి పాపగ నీవు నన్ను కాచితివి కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను ఇలలో నిన్ను కొలిచెదను || నా ప్రాణమా || నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలియింతును || 2 || నీవు చేసిన మేళ్ళను నేనెట్లు మరతు ప్రభు నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును నే ఇలలో జీవింతును || నా ప్రాణమా ||


niti vagula koraku duppi asinchunatlu ni koraku napranamu dappigonuchunnadi na pranama na samastamaprabhuni stutiyinchuma na yesu chesina mellanu nivu maruvakuma panikirani nannu nivu paikilepitivi kristane bandapaina nannunilipitivi || 2 || na adugulu sthiraparachi balamu nichchitivi nidu adugu jadalane vembadintu prabhu ne vembadintu prabhu || na pranama || andhakarapu loyalalo nenu nadachitini e apayamu rakunda nannu nadipitivi || 2 || kanti papaga nivu nannu kachitivi kanna tandrivi nivani ninnu kolichedanu ilalo ninnu kolichedanu || na pranama || nidu atmato ninduga nannu nimpu prabhu atma phalamulu dandiga nikai phaliyintunu || 2 || nivu chesina mellanu nenetlu maratu prabhu ni koraku ne saksiga ilalo jivintunu ne ilalo jivintunu || na pranama ||