మహిమ స్వరూపుడా

Mahima Svarupuda

18 Nov 2025

మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు ||2|| నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ గాయములద్వారా స్వస్థతనొంది అనందించెద నీలో నేను ||2|| ||మహిమ|| విరిగిన మనస్సు నలిగినా హృదయం నీ కిష్టమైన బలియాగముగా నీ చేతితోనే విరిచిన రోట్టెనై ఆహారమౌదును అనేకులకు ||2|| ||మహిమ|| పరిశుద్ధత్మ ఫలముపొంది పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై సీయోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను ||2|| ||మహిమ||


mahima svarupuda mrtyunjayuda maranapumullunu virichinavada nike stotramulu na yesayya nike stotramulu ||2|| ni raktamunu na raksanakai baliyagamuga arpinchinavu ni gayamuladvara svasthatanondi anandincheda nilo nenu ||2|| ||mahima|| virigina manas'su naligina hrdayam ni kistamaina baliyagamuga ni chetitone virichina rottenai aharamaudunu anekulaku ||2|| ||mahima|| parisud'dhatma phalamupondi paripurnamaina jyestula sanghamai siyonu raja ni mukhamu chuda asato nenu vechiyunnanu ||2|| ||mahima||