ఎంత జాలి యేసువా
Enta Jali Yesuva
ఎంత జాలి యేసువా యింతయని యూహించలేను ||ఎంత|| హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను || 2 || అవిశ్వాసినైన నన్ను || 2 || ఆదరించినావుగా ||ఎంత|| రక్షకుండ నాకు బదులు శిక్ష ననుభవించినావు || 2 || సిలువయందు సొమ్మసిల్లి || 2 || చావొందితివి నాకై ||ఎంత|| ఏమి నీ కర్పించగలను ఏమి లేమి వాడనయ్యా || 2 || రక్షణంపు పాత్రనెత్తి || 2 || స్తొత్రమంచు పాడెద ||ఎంత|| నీదు నామమునకు యిలలో భయపడెడు వారి కొరకై || 2 || నాథుడా నీ విచ్చు మేలు || 2 || ఎంత గొప్పదేసువా ||ఎంత|| నేను బ్రతుకు దినములన్ని క్షేమమెల్ల వేళలందు || 2 || నిశ్చయముగ నీవు నాకు || 2 || ఇచ్చువాడా ప్రభువా ||ఎంత|| నాదు ప్రాణమునకు ప్రభువా సేద దీర్చు వాడ వీవు || 2 || నాదు కాపరివి నీవు || 2 || నాకు లేమి లేదుగా ||ఎంత|| అందరిలో అతి శ్రేష్ఠుండా అద్వితీయుడగు యేసయ్యా || 2 || హల్లెలూయ స్తోత్రములను || 2 || హర్షముతో పాడెద ||ఎంత||
enta jali yesuva yintayani yuhinchalenu ||enta|| hanikaruda hinsakudanu devadusakudanu nenu || 2 || avisvasinaina nannu || 2 || adarinchinavuga ||enta|| raksakunda naku badulu siksa nanubhavinchinavu || 2 || siluvayandu som'masilli || 2 || chavonditivi nakai ||enta|| emi ni karpinchagalanu emi lemi vadanayya || 2 || raksanampu patranetti || 2 || stotramanchu padeda ||enta|| nidu namamunaku yilalo bhayapadedu vari korakai || 2 || nathuda ni vichchu melu || 2 || enta goppadesuva ||enta|| nenu bratuku dinamulanni ksemamella velalandu || 2 || nischayamuga nivu naku || 2 || ichchuvada prabhuva ||enta|| nadu pranamunaku prabhuva seda dirchu vada vivu || 2 || nadu kaparivi nivu || 2 || naku lemi leduga ||enta|| andarilo ati sresthunda advitiyudagu yesayya || 2 || halleluya stotramulanu || 2 || harsamuto padeda ||enta||