దేవా మా కుటుంబము

Deva Ma Kutumbamu

01 Mar 2026

దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము ఈ శాప లోకానా నీ సాక్షులుగ నిలువ || 2 || నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము || 2 || కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్య లోబడి జీవింతుము లోపంబులు సవరించుము లోకాశలువీడి లోకంబులోన నీమందగా ఉందుము || దేవా మా || సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకింమ్ము నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్య ఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగ మమ్ములను బలపరచుము || దేవా మా || ఏ కీడు రాకుండగా కాపాడుము మాపిల్లలను లోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలో వోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్ || దేవా మా || పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్ నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము. || దేవా మా ||


deva ma kutumbamu ni sevake ankitamu i sapa lokana ni saksuluga niluva || 2 || ni atmato nimpuma ni atmato nimpuma deva ma kutumbamu ni sevake ankitamu || 2 || kapari ma yesu prabhuve koduvemi ledu maku makemi bhayamu makemi digulu nike vandanamulayya lobadi jivintumu lopambulu savarinchumu lokasaluvidi lokambulona nimandaga undumu || deva ma || samrd'dhi jivambunu samrd'dhiga makimm'mu nem'madigala illu nim'malamagu manas'su im'mahilo makim'mayya im'muga dayacheyumu ginnenindina anubhavamu enno kutumbala dhan'yuluga cheyanga mam'mulanu balaparachumu || deva ma || e kidu rakundaga kapadumu mapillalanu lokadura vyasanamula takudulekunda dachumu nichetulalo voliva mokkala valenu dhraksa tigalanu poli phalasampadalatonu kalakalamu jivincha kuripinchumu nidivenalan || deva ma || pempara jeyumu malo sompuga nighana preman nimpuma hrdayamula santibhagyambulato santasambuga sagedamu vintaina nipremanu antata prakatintumu kontakalame memu undumu lokana chentacheraga koredamu. || deva ma ||