యేసయ్యా కనికరపూర్ణుడా

Yesayya Kanikarapurnuda

Hossanna Ministers 23 Nov 2025

యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా || 2 || నీవే నా సంతోష గానము సర్వ సంపదలకు ఆధారము || 2 || ||యేసయ్యా|| నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి || 2 || సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే || 2 || ||యేసయ్యా|| నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి || 2 || అలసిన వారి ఆశను తృప్తిపరచితివి అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము || 2 || ||యేసయ్యా|| నీ వలన బలమునొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు || 2 || నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు || 2 || ||యేసయ్యా|| ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4) ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)


yesayya kanikarapurnuda manohara premaku nilayuda || 2 || nive na santosa ganamu sarva sampadalaku adharamu || 2 || ||yesayya|| na valana ediyu asinchakaye preminchitivi nanu raksinchutaku unnata bhagyamu vidachitivi || 2 || siluva mranupai raktamu karchi raksinchitivi sasvata krpa pondi jivintunu ila ni korake || 2 || ||yesayya|| na koraku sarvamu dharalamuga dayacheyuvadavu dahamu tirchutaku bandanu chilchina upakarivi || 2 || alasina vari asanu trptiparachitivi ananta krpapondi aradhintunu anuksanamu || 2 || ||yesayya|| ni valana balamunondina vare dhan'yulu ni sannidhi ayina siyonulo varu nilichedaru || 2 || niluvaramaina rajyamulo ninu chuchutaku nityamu krpapondi sevinchedanu tudivaraku || 2 || ||yesayya|| aradhanaku yogyudavu ellavelala pujyudavu (4) ellavelala pujyudavu aradhanaku yogyudavu (4)