లెక్కించలేని స్తోత్రముల్

Lekkincaleni Stotramul

30 Nov 2025

లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ||2|| ఇంత వరకు నా బ్రతుకులో ||2|| నువ్వు చేసిన మేళ్ళకై || లెక్కించలేని || ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును ||2|| భూమిలో కనబడునవన్ని ||2|| ప్రభువా నిన్నే కీర్తించున్ || లెక్కించలేని || అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును ||2|| భూమిపైనున్నవన్ని ||2|| దేవా నిన్నే పొగడును || లెక్కించలేని || నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు ||2|| ఆకాశామున ఎగురునవన్ని ||2|| ప్రభువా నిన్నే కీర్తించున్ || లెక్కించలేని ||


lekkinchaleni stotramul deva ellappudu ne padedan deva ellappudu ne padedan ||2|| inta varaku na bratukulo ||2|| nuvvu chesina mellakai || lekkinchaleni || akasa mahakasamul vatiyandunna sarvambunu ||2|| bhumilo kanabadunavanni ||2|| prabhuva ninne kirtinchun || lekkinchaleni || adavilo nivasinchuvanni sudigaliyu manchunu ||2|| bhumipainunnavanni ||2|| deva ninne pogadunu || lekkinchaleni || nitilo nivasinchu pranul i bhuvilona jiva rasulu ||2|| akasamuna egurunavanni ||2|| prabhuva ninne kirtinchun || lekkinchaleni ||