అదిగదిగో అల్లదిగో
Adigadigo Alladigo
అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో|| గెత్సేమను ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో || 2 || అచటనే యుండి ప్రార్ధించుడని || 2 || పలికిన క్రీస్తు మాటదిగో || 2 || ||అదిగదిగో|| శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు || 2 || ప్రభువును యూదులకప్పగింప || 2 || పెట్టిన దొంగ ముద్దదిగో || 2 || ||అదిగదిగో|| లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై || 2 || పావనుడేసుని రక్తమును గల || 2 || ముప్పది రూకల మూటదిగో || 2 || ||అదిగదిగో|| చలి కాచుకొను గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో || 2 || మూడవసారి బొంకిన వెంటనే || 2 || కొక్కొరొకోయను కూతదిగో || 2 || ||అదిగదిగో|| యూదుల రాజువు నీవేనా మోదముతో నీవన్నట్లే || 2 || నీలో దోషము కనుగొనలేక || 2 || చేతులు కడిగిన పిలాతుడాడుగో || 2 || ||అదిగదిగో|| గొల్గొతా స్థల అద్దరిని ఆ ఇద్దరు దొంగల మధ్యమున || 2 || సాక్షాత్తు యెహోవా తనయుని || 2 || సిలువను వేసిరి చూడదిగో || 2 || ||అదిగదిగో|| గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో || 2 || యూదుల రాజా దిగి రమ్మనుచు || 2 || హేళన చేసిన మూకదిగో || 2 || ||అదిగదిగో|| దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు || 2 || పరిశుద్ధుడు మన రక్షకుడేసు || 2 || మన మది యేమో గమనించు || 2 || ||అదిగదిగో||
adigadigo alladigo kalvari mettaku daradigo a prabhuvunu vesina siluvadigo ||adigadigo|| getsemanu oka totadigo a totalo prardhana sthalamadigo || 2 || achatane yundi prardhinchudani || 2 || palikina kristu matadigo || 2 || ||adigadigo|| sisyulalo iskariyotu yudayanu oka ghatakudu || 2 || prabhuvunu yudulakappagimpa || 2 || pettina donga muddadigo || 2 || ||adigadigo|| lekhanamu neraverutakai i lokapu papamu povutakai || 2 || pavanudesuni raktamunu gala || 2 || muppadi rukala mutadigo || 2 || ||adigadigo|| chali kachukonu gumpadigo a peturu bonkina sthalamadigo || 2 || mudavasari bonkina ventane || 2 || kokkorokoyanu kutadigo || 2 || ||adigadigo|| yudula rajuvu nivena modamuto nivannatle || 2 || nilo dosamu kanugonaleka || 2 || chetulu kadigina pilatudadugo || 2 || ||adigadigo|| golgota sthala addarini a iddaru dongala madhyamuna || 2 || saksattu yehova tanayuni || 2 || siluvanu vesiri chudadigo || 2 || ||adigadigo|| golluna edchina talladigo a talliki cheppina matadigo || 2 || yudula raja digi ram'manuchu || 2 || helana chesina mukadigo || 2 || ||adigadigo|| dahamu gonuchunnananuchu pranamu vidichenu pavanudu || 2 || parisud'dhudu mana raksakudesu || 2 || mana madi yemo gamaninchu || 2 || ||adigadigo||