రారే చూతము రాజసుతుని
Rare Cutamu Rajasutuni
రారే చూతము రాజసుతుని రేయి జనన మాయెను || 2 || రాజులకు రారాజు మెస్సయ్యా || 2 || రాజితంబగు తేజమదిగో || 2 || ||రారే|| దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా || 2 || దేవుడే మన దీనరూపున || 2 || ధరణి కరిగె-నీ దినమున || 2 || ||రారే|| కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయుల దర్శనం || 2 || తెల్లగానదే తేజరిల్లెడి || 2 || తార గాంచరే త్వరగ రారే || 2 || ||రారే|| బాలు-డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు || 2 || బాల బాలిక బాలవృద్ధుల || 2 || నేల గల్గిన నాథుడు || 2 || ||రారే|| యూదవంశము నుద్ధరింప దావీదుపురమున నుద్భవించె || 2 || సదమలంబగు మదిని గొల్చిన || 2 || సర్వ జనులకు సార్వభౌముడు || 2 || ||రారే||
rare chutamu rajasutuni reyi janana mayenu || 2 || rajulaku raraju mes'sayya || 2 || rajitambagu tejamadigo || 2 || ||rare|| duta ganamulan deri chudare daiva vakkulan delpaga || 2 || devude mana dinarupuna || 2 || dharani karige-ni dinamuna || 2 || ||rare|| kallagadidi kalayu gadidi golla boyula darsanam || 2 || tellaganade tejarilledi || 2 || tara ganchare tvaraga rare || 2 || ||rare|| balu-dadugo vela suryula bolu sadguna siludu || 2 || bala balika balavrd'dhula || 2 || nela galgina nathudu || 2 || ||rare|| yudavansamu nud'dharimpa davidupuramuna nudbhavinche || 2 || sadamalambagu madini golchina || 2 || sarva janulaku sarvabhaumudu || 2 || ||rare||