ఎంత దీనాతి దీనమో

Enta Dinati Dinamo

27 Nov 2025

ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా || 2 || నీ జనన మెంత దయనీయమో తలచుకుంటె నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా || 2 || ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా || 2 || ||ఎంత|| నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా || 2 || దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా || 2 || ||ఎంత|| చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా || 2 || పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా || 2 || ||ఎంత||


enta dinati dinamo o yesayya || 2 || ni janana menta dayaniyamo talachukunte na gunde tadabadi karigi karigi niraguchunnadi ni srstilo i lokame nivu maku ichchina satramayya || 2 || a satramulo o yesayya niku sthalame dorakaledayya || 2 || ||enta|| nindu chulalu mariyam'ma talli naduvaleka sudivadi poyenayya || 2 || dikkutochaka o yesayya pasuvulapakalo prasavinchenayya || 2 || ||enta|| challagalilo chatu leka nalumulala chaliputtenayya || 2 || pasikanduvai oyesayya talli odilo odiginavayya || 2 || ||enta||