మహామహిమతో నిండిన
Mahamahimato Nindina
మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్య మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి ||2|| సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు ||2|| ||మహామహిమతో|| కరములుచాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి ||2|| అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు నిర్మాలుడా భాహువు చాపి దీవించువాడవు ||2|| ||మహామహిమతో || పదివేలలోన గుర్తించదగిన - సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు - కలిగిన వాడవు ||2|| ఉన్నతుడా - మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా - ప్రభాకరుడా నిను ఆరాధించెదను ||2|| ||మహామహిమతో ||
mahamahimato nindina krpa satyasampurnuda israyelu stotramulapai asinuda yesayya na stutula sinhasanam nikosame yesayya mahimanu vidichi bhuvipaiki digivachchi - karunato nanu pilichi satyamunu bodhinchi chikatini tolaginchi - veluguto nimpitivi ||2|| sadayudavai na padamulu totrillanivvaka sthiraparachi ni krpalo nadipinchuvadavu ||2|| ||mahamahimato|| karamuluchachi jalarasulalonundi - nanu levanettitivi ksemamunu dayachesi nanu vembadinchi anudinamu kachitivi ||2|| aksayuda premanuchupi adarinchinavu nirmaluda bhahuvu chapi divinchuvadavu ||2|| ||mahamahimato || padivelalona gurtinchadagina - sundarudavu nivu aparanji padamulu agni netramulu - kaligina vadavu ||2|| unnatuda - mahonnatuda aradhinchedanu raksakuda - prabhakaruda ninu aradhinchedanu ||2|| ||mahamahimato ||