ఆధారం నీవే - ఆదరణ నీవే
Adharam Nive Adarana Nive
ఆధారం నీవే - ఆదరణ నీవే ఆశ్రయము నీవే నా యేసయ్యా ||2|| నన్నావరించి నడిపించు మేఘమా నా ముందు నడిచే అగ్ని స్థంభమా. ||2|| ||ఆధారం|| నన్నెంతగానో ప్రేమించి నీవు గొల్వతా కొండకు నను మోసినావు ||2|| అమరత్వానికి మార్గము చూపిన పునరుత్థానుడా స్తోత్రము. ||2|| ||ఆధారం|| నిజమైన స్నేహితునిగా దరిచేరి నీలోని సుగుణాలు బోధించితివే ||2|| నీ సహవాసమే మనిషిగ మార్చినది సుగుణాల సంపన్నుడా స్తోత్రము ||2|| ||ఆధారం|| నా దాగుచోటు నీవే యేసయ్యా ఏ తెగులు ఎన్నడు దరిచేరనియ్యవు ||2|| నా ఎదుగుదలకు పందిరి నీవే నా క్షేమాధారమా స్తోత్రము ||2|| ||ఆధారం||
adharam nive - adarana nive asrayamu nive na yesayya ||2|| nannavarinchi nadipinchu meghama na mundu nadiche agni sthambhama. ||2|| ||adharam|| nannentagano preminchi nivu golvata kondaku nanu mosinavu ||2|| amaratvaniki margamu chupina punarut'thanuda stotramu. ||2|| ||adharam|| nijamaina snehituniga daricheri niloni sugunalu bodhinchitive ||2|| ni sahavasame manisiga marchinadi sugunala sampannuda stotramu ||2|| ||adharam|| na daguchotu nive yesayya e tegulu ennadu daricheraniyyavu ||2|| na edugudalaku pandiri nive na ksemadharama stotramu ||2|| ||adharam||