మహాఘనుడవు మహోన్నతుడవు

Mahaghanudavu Mahonnatudavu

30 Nov 2025

మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు ||2|| కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా ||2|| వినయముగల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని ||2|| నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో ||2|| హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా ||2|| ||మహా|| దీన మనస్సు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని ||2|| నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెళకువతో ||2|| హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా ||2|| ||మహా|| శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని ||2|| నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు ||2|| హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా ||2|| ||మహా||


mahaghanudavu mahonnatudavu parisud'dha sthalamulone nivasinchuvadavu ||2|| krpa satya sampurnamai ma madhyalo nivasinchuta n'yayama nanu parisud'dhaparachute ni dharmama ||2|| vinayamugala varini tagina samayamulo hechchinchuvadavani ||2|| nivu vadu patranai nenundutakai nilichiyundunu pavitratato ||2|| halleluya yesayya nike stotramaya ||2|| ||maha|| dina manas'su galavarike samrd'dhiga krpanu dayacheyuvadavani ||2|| ni samukhamulo sajiva saksinai kapadukondunu melakuvato ||2|| halleluya yesayya nike stotramaya ||2|| ||maha|| sodhimpabadu variki margamu chupinchi tappinchuvadavani ||2|| na siluva moyuchu ni siluva nidanu visramintunu antamu varaku ||2|| halleluya yesayya nike stotramaya ||2|| ||maha||