నీ చేతితో నన్ను పట్టుకో

Ni Cetito Nannu Pattuko

03 Dec 2025

నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము || 2 || అంధకార లోయలోన సంచరించినా భయములేదు నీ వాక్యం శక్తిగలది నా త్రోవకు నిత్యవెలుగు || 2 || ఘోరపాపిని నేను తండ్రి పాప ఊభిలో పడియుంటిని లేవనెత్తుము శుద్దిచేయుము పొందనిమ్ము నీదు ప్రేమను || 2 || ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసెదన్ || 2 || ||నీ చేతితో||


ni chetito nannu pattuko ni atmato nannu nadupu silpi chetilo silanu nenu anuksanamu nannu chekkumu || 2 || andhakara loyalona sancharinchina bhayamuledu ni vakyam saktigaladi na trovaku nityavelugu || 2 || ghorapapini nenu tandri papa ubhilo padiyuntini levanettumu suddicheyumu pondanim'mu nidu premanu || 2 || i bhuvilo raju nive na hrdilo santi nive kum'marinchumu nidu atmanu jivitantamu seva chesedan || 2 || ||ni chetito||