స్తుతి పాడుటకే బ్రతికించిన

Stuti Padutake Bratikincina

Pst Anadh Jay Kumar 05 Dec 2025

స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా || 2 || జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును ||స్తుతి పాడుటకే|| ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు || 2 || నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను ||స్తుతి పాడుటకే|| నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు || 2 || నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను ||స్తుతి పాడుటకే|| హేతువులేకయే ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు || 2 || నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై ||స్తుతి పాడుటకే||


stuti padutake bratikinchina - jivanadatavu nivenayya innalluga nanu posinchina - tallivale nanu odarchina ni prema napai ennadu maradu yesayya || 2 || jivitakalamanta adharam nivenayya na jivitakalamanta aradhinchi ghanaparatunu ||stuti padutake|| pranabhayamunu tolaginchinavu - prakaramulanu sthapinchinavu sarvajanulalo ni mahima vivarimpa dirghayuvuto nanu nimpinavu || 2 || ni krpa bahulyame vidani anubandhamai talachina pratiksanamuna nutana balamichchenu ||stuti padutake|| napai udayinche ni mahima kiranalu - kanumarugayenu na dukha:dinamulu krpalanupondi ni kadi moyutaku lokamulonundi erparachinavu || 2 || ni divya sankalpame- avanilo subhapradamai ni nitya rajyamunakai niriksana kaliginchenu ||stuti padutake|| hetuvulekaye preminchinavu - vedukaga ila nanu marchinavu kalavaramondina velalayandu na cheyi viduvaka nadipinchinavu || 2 || ni prema madhuryame na nota stutiganamai nilichina prati sthalamuna parenu selayerulai ||stuti padutake||