సుధా మధుర కిరణాల

Sudha Madhura Kiranala

05 Dec 2025

సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం || 2 || తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది || 2 || ||సుధా|| దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని || 2 || నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని || 2 || ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది || 2 || నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ || 2 || ||సుధా|| లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు || 2 || క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా || 2 || నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే || 2 || ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము || 2 || ||సుధా||


sudha madhura kiranala arunodayam karunamayuni saranam arunodayam || 2 || tera marugu hrdayalu velugainavi maranala cherasala marugainadi || 2 || ||sudha|| divi rajuga bhuviki diginadani - ravi rajuga ilanu migiladani || 2 || navaloka gaganalu pilichadani - paraloka bhavanalu terichadani || 2 || arani jivana jyotiga velige tarokatochchindi pade patala pasuvulasalanu uyala chesindi || 2 || ninu pavaga - nirupedaga - janminchaga - ila panduga || 2 || ||sudha|| lokalalo papa sokalalo - ekakila bratuku avivekulu || 2 || ksama hrdaya sahanalu samapaluga - premanuragalu sthira astiga || 2 || nam'mina varini ram'mani piliche raksakuda yese nitya sukhala jivajalala pennidhi a prabhuve || 2 || a janmame - oka marmamu - a bandhame - anubandhamu || 2 || ||sudha||