బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా
Bratakalani Unna Bratakalekunna
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా || 2 || చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా బ్రతికించుమో యేసయ్యా దరి చేర్చుమో నన్నయ్యా || 2 || ||బ్రతకాలని|| కాపరి లేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి కావలి లేని తోటనైతి కారడవిగా నే మారితి గూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఎకాకినైతి గుండె దిగులుగా ఉందయ్యా గూడు చేర్చుమో యేసయ్యా || 2 || ||బ్రతకాలని|| నా ఆశలే అడియాశలై అడుగంటెనే నా జీవితం శోధనల సుడివడిలో తొట్రిల్లెనే నా పయనం చుక్కాని లేని నావనైతి గమ్యం తెలియక అల్లాడుచుంటి గురి చేర్చుమో యేసయ్యా గుండె గుడిలో నీవుండయ్యా || 2 || ||బ్రతకాలని||
bratakalani unna bratakalekunna nilavalani unna nilavalekunna || 2 || chudalani unna chudalekunna cheralani unna ninu cheralekunna bratikinchumo yesayya dari cherchumo nannayya || 2 || ||bratakalani|| kapari leni gorrenaiti katiki ne cheruvaiti kavali leni totanaiti karadaviga ne mariti gudu chedarina guvvanaiti gunde pagilina ekakinaiti gunde diguluga undayya gudu cherchumo yesayya || 2 || ||bratakalani|| na asale adiyasalai adugantene na jivitam sodhanala sudivadilo totrillene na payanam chukkani leni navanaiti gamyam teliyaka alladuchunti guri cherchumo yesayya gunde gudilo nivundayya || 2 || ||bratakalani||