ప్రభు యేసుని వదనములో
Prabhu Yesuni Vadanamulo
ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె || 2 || పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో || 2 || పరలోకముకై – చిర జీవముకై || 2 || ప్రార్ధించెను నా హృదయం ||ప్రభు యేసుని|| దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో || 2 || దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును || 2 || ధన పీడనతో – మృగ వాంఛలతో || 2 || దిగాజారితి చావునకు ||ప్రభు యేసుని|| యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు || 2 || ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని || 2 || ఇల వేడితిని – విలపించుచును || 2 || ఈడేరెను నా వినతి ||ప్రభు యేసుని|| పరదైసున ఈ దినమే – నా ఆనందములోను || 2 || పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే || 2 || పరలోకమే నా – తుది ఊపిరిగా || 2 || పయనించితి ప్రభు కడకు ||ప్రభు యేసుని||
prabhu yesuni vadanamulo - na devudu kanipinche || 2 || papatmula brochutakai - krpalolikina kaluvarilo || 2 || paralokamukai - chira jivamukai || 2 || prardhinchenu na hrdayam ||prabhu yesuni|| disalanniyu tirigitini - na papapu dahamuto || 2 || daustyamulo masaluchunu - daurjan'yamu cheyuchunu || 2 || dhana pidanato - mrga vanchhalato || 2 || digajariti chavunaku ||prabhu yesuni|| yesu ni rajyamulo - bhuvi ketenchedi roju || 2 || i papini ksamiyinchi - jnapakamuto brovumani || 2 || ila veditini - vilapinchuchunu || 2 || iderenu na vinati ||prabhu yesuni|| paradaisuna i diname - na anandamulonu || 2 || palgonduvu nivanuchu - vagdhanamu cheyagane || 2 || paralokame na - tudi upiriga || 2 || payaninchiti prabhu kadaku ||prabhu yesuni||