అందాలతార అరుదెంచె
Andalatara Arudence
అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార|| విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార|| యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు ||అందాల తార|| ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే బాలునిజూడ జీవితమెంత పావనమాయెను ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన ||అందాల తార||
andalatara arudenche nakai ambara vidhilo avataramurti yesayya kirti avani chatuchun anandasandra mupponge nalo amarakantilo adi devuni juda asimpa manasu payanamaitini ||andala tara|| visvasayatra duramentaina vinduga dochenu vintaina santi varsinche nalo vijayapathamuna visvalaneledi devakumaruni viksinchu diksato virajim'me balamu pravahinche prema visranti nosaguchun ||andala tara|| yerusalemu rajanagarilo yesunu vedakuchu erigina dari tolagina vela edalo krngiti yesayyatara eppativole eduraye trovalo ento yabburapaduchu vismaya monduchu egiti svami kadaku ||andala tara|| prabhujanmasdhalamu pakayegani paraloka saudhame balunijuda jivitamenta pavanamayenu prabhupadapuja divenakaga prasarinche punyamu bratuke mandiramaye arpanale sirulaye phaliyinche prardhana ||andala tara||