భాసిల్లెను సిలువలో పాపక్షమా

Bhasillenu Siluvalo Papaksama

A. B. Masilamani Garu 06 Dec 2025

భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను|| కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి || 2 || ||భాసిల్లెను|| దోషము చేసినది నేనెకదా మోసముతో బ్రతికిన నేనెకదా మోసితివా నా శాపభారం || 2 || ||భాసిల్లెను|| పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి || 2 || ||భాసిల్లెను|| నీ మరణపు వేదన వృధా గాదు నా మది నీ వేదనలో మునిగెను క్షేమము కలిగెను హృదయములో || 2 || ||భాసిల్లెను|| ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికి అందులకే భయమొందితిని || 2 || ||భాసిల్లెను|| నమ్మిన వారిని కాదన వనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను || 2 || ||భాసిల్లెను||


bhasillenu siluvalo papaksama yesu prabhu ni divya ksama ||bhasillenu|| kaluvarilo na papamu ponchi siluvaku ninnu yahuti chesi kalusahara karuninchitivi || 2 || ||bhasillenu|| dosamu chesinadi nenekada mosamuto bratikina nenekada mositiva na sapabharam || 2 || ||bhasillenu|| papamu chesi gadinchiti maranam sapamega nenarjinchinadi kaparivai nanu brochitivi || 2 || ||bhasillenu|| ni maranapu vedana vrdha gadu na madi ni vedanalo munigenu ksemamu kaligenu hrdayamulo || 2 || ||bhasillenu|| endulako napai i prema andadayya svami na madiki andulake bhayamonditini || 2 || ||bhasillenu|| nam'mina varini kadana vaniyu nem'madi nosagedi na prabhudavani nam'miti ni padambulanu || 2 || ||bhasillenu||