అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
Atiparisuddhuda Stuti Naivedyamu
అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును || 2 || నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీ కోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా ||అతిపరిశుద్ధుడా|| సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే || 2 || ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం || 2 || నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి || 2 || ||అతిపరిశుద్ధుడా|| సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే || 2 || కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా || 2 || నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా || 2 || ||అతిపరిశుద్ధుడా|| సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక || 2 || ఉన్నావులే ప్రతిక్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగున || 2 || నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి || 2 || ||అతిపరిశుద్ధుడా||
atiparisud'dhuda stuti naivedyamu nike arpinchi kirtintunu || 2 || nivu na paksamai nanu divinchaga nivu na toduvai nanu nadipinchaga jivintunu ni kosame - asrayamaina na yesayya ||atiparisud'dhuda|| sarvonnatamaina sthalamulayandu ni mahima vivarimpaga unnatamaina ni sankalpamu ennadu ascharyame || 2 || mundennadu chavichudani sarikrottadaina premamrtam || 2 || nilone dachavu inatikai ni rnam tiradu enatiki || 2 || ||atiparisud'dhuda|| sadgunarasi ni jadalanu na yeduta nunchukoni gadichina kalam sagina payanam ni krpaku sanketame || 2 || krpa vembadi krpa pondaga maranu madhuramuga ne pondaga || 2 || nalona e manchi chusavayya ni prema chupitivi na yesayya || 2 || ||atiparisud'dhuda|| sarepainunna patraga nannu chejariponivvaka sodhanalenno edirinchinanu nanu soliponivvaka || 2 || unnavule pratiksanamuna kalisunnavule prati aduguna || 2 || nivega yesayya na upiri nivega yesayya na kapari || 2 || ||atiparisud'dhuda||