సుగుణాల సంపన్నుడా
Sugunala Sampannuda
సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే ||సుగుణాల|| యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించాగలవు నేను నడవవలసిన త్రోవలో ||సుగుణాల|| యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే ||సుగుణాల||
sugunala sampannuda - stuti ganala varasuda jivintunu nityamu ni nidalo asvadintunu ni matala makarandamu yesayya nito jivinchagane na bratuku bratukuga marenule natyamadenu na antarangamu idi raksanananda bhagyame ||sugunala|| yesayya ninnu vennantagane ajnala margamu kanipinchene nivu nannu nadipinchagalavu nenu nadavavalasina trovalo ||sugunala|| yesayya ni krpa talanchagane na sramalu sramaluga anipinchalede nivu nakichche mahima eduta ivi ennataginavi kave ||sugunala||