చిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగా

Chinnari baalaga chirudivya jyothiga

28 Oct 2025

చిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగా కనరాని దేవుడు కనిపించెనా తన ప్రేమ నా పైన కురిపించెనా… కురిపించెనా జో.. లాలిజో.. జో… లాలిజో… పరలోక భోగాలు వర దూత గానాలు తనకున్న భాగ్యాలు విడనాడెనా || 2 || పాపాలు భరియించెనా – శాపాలు భరియించెనా ఆనందమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే ||జో లాలిజో|| దావీదు తనయుండై మహిమా స్వరూపుండై మానుజావతారుండై పవళించెనా || 2 || గాఢాంధకారంబున ఒక తార ఉదయించెనా ప్రభు బాలుడై ప్రభు యేసుడు మరియమ్మ ఒడిలోన నిదురించెనా ||జో లాలిజో|| శాంతి స్వరూపుండు కరుణా సముద్రుండు కడు శక్తిమంతుడు కమనీయుడు || 2 || ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కర్తాయనే అభిషిక్తుడు ఆరాధ్యుడు ప్రేమామయుడు ప్రియుడేసుడు ||జో లాలిజో||


chinnari balaga chirudivya jyotiga kanarani devudu kanipinchena tana prema na paina kuripinchena... kuripinchena jo.. lalijo.. jo... lalijo... paraloka bhogalu vara duta ganalu tanakunna bhagyalu vidanadena || 2 || papalu bhariyinchena - sapalu bhariyinchena anandame ascharyame santosame samadhaname ||jo lalijo|| davidu tanayundai mahima svarupundai manujavatarundai pavalinchena || 2 || gadhandhakarambuna oka tara udayinchena prabhu baludai prabhu yesudu mariyam'ma odilona nidurinchena ||jo lalijo|| santi svarupundu karuna samudrundu kadu saktimantudu kamaniyudu || 2 || ascharyakarudayane alochana kartayane abhisiktudu aradhyudu premamayudu priyudesudu ||jo lalijo||